ETV Bharat / state

విశాఖలో యువకుని దారుణ హత్య

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. సబ్బవరం మండలం అమరపన్నివాని పాలెంలో ఓ యువకుణ్ని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి గోనెసంచిలో వేసి కాల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

brutal murder
విశాఖలో గుర్తు తెలియని వ్యక్తి హత్య
author img

By

Published : Dec 20, 2019, 5:09 PM IST

ఇవీ చదవండి:

Intro:ap_gnt_46_20_machya_karula_samasya_V.O_ap10035

ఈటీవీ కంట్రిబ్యూటర్
మీరాసాహెబ్. 7075757517
రేపల్లె
గుంటూరు జిల్లా..

(విత్ వాయిస్ ఓవర్..ఎడిటింగ్ ..పి టు సి )


మత్స్యకారుల అభివృద్ధికి లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఫిష్ ల్యాండ్ సెంటర్ భవనం నిర్మించారు. కానీ బోట్లు నిలిపేందుకు జెట్టి నిర్మించడం మరిచారు. దీంతో మినీ హార్బర్ నిరుపయోగంగా మారి.. మత్స్యకారులు సమస్యలు ఎదుర్కొనే పరిస్తితి నెలకొంది. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని తీర ప్రాంతమైన కొత్తపాలెంలో పరిస్థితి ఇది.

వాయిస్: గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కొత్త పాలెం గ్రామంలో 400 వేట బోట్లు ఉన్నాయి .ఇక్కడి మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల క్రితం సుమారు 90 లక్షల వ్యయంతో గొంది సముద్రం వద్ద మినీ హార్బర్ గా ఫిష్ ల్యాండ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు . వేటకు వెళ్లి వచ్చిన మత్స్యకారులు సరుకును నిల్వ ఉంచుకొని ..ఇక్కడ అమ్ముకోవడంతో పాటు వలలు మరమ్మతు చేసుకునేందుకు వీలుగా ఈ ఫిష్ ల్యాండ్ సెంటర్ ను నిర్మించారు.

వాయిస్: కానీ ఇక్కడ మత్స్య సంపదను దించుకునేందుకు.. బోట్లు నిలుపుకునేందుకు జెట్టి లేకపోవడంతో మత్స్యకారులు తమ బోట్లను ఇతర ప్రాంతాల్లో నింపుకుంటున్నారు . దీంతో గత ఎనిమిది సంవత్సరాలుగా మినీ హార్బర్ నిరుపయోగంగా మారింది ఇప్పటికే భవన గోడలు పెచ్చులూడి లోపలి ప్రాంగణమంతా పిచ్చి మొక్కల తో నిండిపోయింది. మరోవైపు రేవు మార్గంలో పూడికలు రావడంతో బోట్లు మినీ హార్బర్ కు రాలేని పరిస్థితి నెలకొంది.

వాయిస్: ఈ సమస్యల వలన సరుకుదించుకునేందుకు.. అమ్ముకునేందుకు అనువైన ప్రదేశం లేక తమ జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బోట్లను వేరే ప్రాంతాల్లో నిలవాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుందని.. మరో జెట్టి వద్దకు వెళ్లేందుకు రెట్టింపు సమయం పడుతుందని చెబుతున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు. లేకపోతే లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన మినీ హార్బర్ సెంటర్ శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారుతుందని ..దీనివలన తమ ఉపాధి పూర్తిస్థాయిలో కోల్పోతామని అంటున్నారు.


Body:బైట్స్.., మత్స్యకారులు


Conclusion:ఈటీవీ కంట్రిబ్యూటర్
మీరాసాహెబ్. 7075757517
రేపల్లె
గుంటూరు జిల్లా..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.