విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన ఓ అన్నాచెల్లెళ్ల అనుబంధం ముందు మృత్యువు ఓడిపోయింది. ఐదు పదుల వయసులోనూ అప్యాయతకు మారు పేరుగా నిలిచే ఆ రక్తబంధం.. అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగానికి నిదర్శనంగా నిలిచింది. చెల్లెలు కేత పార్వతి (56).. ఇటీవలే అనారోగ్యంతో చనిపోయింది. ఈ వార్త విన్న అన్న తెర్లాపు చిన్న (59).. చెల్లెలిని కడసారి చూసేందుకు వచ్చాడు. విగతజీవిగా ఉన్న తన ఆడపడుచును చూసి తట్టుకోలేక.. చివరి శ్వాస విడిచాడు. 2 ఆసుపత్రులకు తరలించినా.. ఆయన బతకలేదు. చెల్లి మరణించిన గంటల వ్యవధిలోనే అన్న మరణించడం.. ఆ కుటుంబం విషాదంలో నింపింది.
ఇదీ చదవండి : వరదొచ్చింది..రైతును తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది!