ఇటుక బట్టీ కార్మికులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. మెుున్నటి వరకూ ఇసుక లేకపోవటంతో నిర్మాణ పనులు ఆగిపోయి ఇటుక అమ్ముడుపోక అవస్థలు పడ్డారు. ఇప్పుడు కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కుమ్మరి పనుల్లేక ఇటుక బట్టీ పెట్టుకొని జీవనం సాగిస్తున్న విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లి వాసులు కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు.
పనుల్లేక అవస్థలు పడుతున్న తమకు అకాల వర్షం కారణంగా తయారు చేసిన ఇటుక సైతం తడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటుక బట్టీపై ఆధారపడి సుమారు 60 కుటుంబాలు బతుకుతున్నాయనీ, తమ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: జీడి మామిడికి విపరీతంగా తెగుళ్లు... ఆందోళనలో రైతులు