అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడు శ్రీనివాసుడని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అన్నారు. అయ్యన్నపేటలోని శ్రీ క్షేత్రములో కొలువైయున్న అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వామిజీ మాట్లాడారు.
దేవాలయంలో పంచమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతీ ఒక్కరూ స్థిరచిత్తంతో దేవుని ప్రార్థించాలని.. భక్తిప్రవక్తలు కలిగి ఉండాలని అన్నారు. మనకు ఏది మంచిదో భగవంతుడు దానినే ఇస్తాడని చెప్పారు. దేవుని పట్ల అంకితభావం కలిగి ఉండడం భక్తుల విధి అని అన్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం ఎదుర్కోళ్ల ఉత్సవం.. 27న ఉదయం పంచవింశతి కలశ స్నపనమ్, మార్చి 1న అష్టోత్తర కలశాభిషేకం, 2న ఉత్సవాంత స్నపనమ్ ఉంటాయని దేవాలయ ధర్మకర్తలు దుర్గాబాలాజీ, ఉమాదేవి దంపతులు తెలిపారు. ఈ ఉత్సవాలల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరారు.
ఇదీ చదవండి: