ETV Bharat / state

'భూసేకరణ పూర్తయితే విమానాశ్రయ పనులు ప్రారంభిస్తాం' - విజయనగరం జిల్లా భోగాపురం వార్తలు

విజయనగరం జిల్లా భోగాపురంలోని ఓ ప్రైవేటు రిసార్ట్​లో... కలెక్టర్ హరిజవహర్​లాల్ జిల్లా స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి భూసేకరణ వేగవంతం చేయాలని... పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఈ సందర్భంగా సూచించారు. త్వరితగతిన భూ సేకరణ పూర్తి చేస్తే పనులు పూర్తి చేస్తే విమానాశ్రయ పనుల ప్రారంభడానికి సీఎం సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

bogapuram airport works are to be started after the completion of collecting lands in vizianagaram
భూసేకరణ పూర్తయితే విమానాశ్రయ పనులు ప్రారంభిస్తాం
author img

By

Published : Nov 11, 2020, 7:01 AM IST

విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి భూసేకరణ వేగవంతం చేయాలని... పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ సూచించారు. భోగాపురంలో ఓ ప్రైవేటు రిసార్ట్​లో... కలెక్టర్ హరిజవహర్​లాల్ జిల్లా స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. అప్రోచ్ నిర్మాణానికి 103 ఎకరాల భూమిని అదనంగా సేకరించాల్సి ఉందని వలవన్ అన్నారు. విమానాశ్రయం కోసం తొలి విడతలో 2631, రెండో విడతలో అప్రోచ్ రహదారికి 103.88, మూడో విడతలో ట్రంపెట్ నిర్మాణానికి 15.79 ఎకరాలను సేకరించనున్నట్లు ఆయన తెలిపారు. 1383.39 ఎకరాల జిరాయితీ భూమికి ఇప్పటివరకు 1245.92 ఎకరాలు సేకరించినట్లు పేర్కొన్నారు. 825.55 ఎకరాల అసైన్డ్ భూమికి ఇంకా 320 ఎకరాలు పెండింగ్​లో ఉందన్నారు. సుమారు 300 ఎకరాల వరకు పీఓటీ భూములకు సంబంధించిన వివాదాలు కోర్టులో ఉన్నాయని, ఆయా కేసులపై ఒకట్రెండు రోజుల్లో సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. త్వరితగతిన భూ సేకరణ పూర్తి చేస్తే పనులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.