ETV Bharat / state

సీతానగరం పోలీస్ ఠాణా... ఫ్రెండ్లీ పోలిసింగ్​కు ఉదాహరణ - friendly police station

సాయం కావాల్సి ఉన్నా పోలీస్ స్టేషన్​ గడప తొక్కడానికి చాలా మంది జంకుతుంటారు. సిబ్బంది నిర్లక్ష్యం, గంటల తరబడి ఎదురు చూపులు గుర్తువచ్చి వెనకడుగు వేస్తుంటారు. అయితే సీతానగరంలోని పోలీస్ స్టేషన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఫ్రెండ్లీ పోలీసింగ్​కు ఈ స్టేషన్.. ఉదాహరణలా మారింది. ఈ స్టేషన్ సేవలను గుర్తించిన కేంద్ర హోంశాఖ అవార్డు ఇచ్చి అభినందించింది.

సీతానగరం ఠాణా
author img

By

Published : Jun 3, 2019, 9:03 AM IST

సీతానగరం పోలీస్ ఠాణా...ఫ్రెండ్లీ పోలిసింగ్​కు ఉదాహరణ

విజయనగరం జిల్లాలోని సీతానగరం పోలీస్ స్టేషన్ ప్రజా సేవలో ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంటోంది. ఏదైనా పోలీస్ స్టేషన్​కి వెళితే ఫిర్యాదు చేసేందుకే గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. ఇటువంటి వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సీతానగరంలోని పోలీస్ స్టేషన్​లో ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేశారు. నిర్భయంగా సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఫిర్యాదు దారులు కోసం కౌన్సిలింగ్ హాలును ఏర్పాటు చేశారు. స్టేషన్ మొత్తాన్ని మొక్కలు నాటి పచ్చదనంతో నింపేశారు.

ఎంపిక చేశారిలా...

దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పనితీరుని కేంద్ర హోంశాఖ ప్రతినిధుల బృందం 2018లో పరిశీలించింది. ఇందులో భాగంగా దేశంలో పది పోలీసు స్టేషన్లను ఉత్తమ పోలీసు స్టేషన్ గా ఎంపిక చేయగా మన రాష్ట్రం నుంచి సీతానగరం పోలీసుస్టేషన్ ఉండటం విశేషం. ఠాణాల నిర్వహణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసేందుకు 2018లో అధికారుల బృందం సీతానగరం స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేసింది. పోలీసు స్టేషన్లో గదులు, దస్త్రాలు, మరుగుదొడ్లు, లాకప్ గదులు, పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. సీతానగరం పోలీసు స్టేషన్ లో పనిచేసిన అప్పటి ఎస్ఐ పనితీరుతో పాటు వారి సిబ్బంది పనితీరు, ప్రజలతో నెలకొన్న సత్సంబంధాలు, పరిశుభ్రత, రోడ్ల ప్రమాదాల నివారణ, రికార్డుల సక్రమ నిర్వహణ, కేసుల పరిష్కారం విధానాలను పరిశీలించిన కేంద్ర బృందం జిల్లా నుంచి సీతానగరం ఠాణాను సిఫార్సు చేసింది.

అన్ని విభాగాల్లోనూ ఇతర ఠాణాల కంటే మెరుగ్గా ఉన్నందున 2018 సంవత్సరానికి దేశంలో ఉత్తమమైన పదింటిలో ఒకటిగా సీతానగరం స్టేషన్​ గుర్తింపు లభించింది.కేంద్ర హోంశాఖ అందించిన పురస్కారం స్ఫూర్తితో భవిషత్తులో సీతానగరం ఠాణాను మరింత ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని., అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.

Intro:ఈదురు గాలులకు పాణ్యం సమీపంలో జాతీయ రహదారిపై లారీలు బోల్తాపడ్డాయి

Body:కర్నూలు జిల్లా పాణ్యం మండలం సాయంత్రం వైద్యశాల సమీపంలో లో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు రెండు కంటైనర్లు లారీలు ఒక బొలెరో వాహనం బోల్తా పడ్డాయి సాయంత్రం ఉన్నట్టుండి ఈదురుగాలులు వీచడంతో రహదారి పక్కనున్న బోర్డులు విరిగిపడ్డాయి రహదారిపై వెళ్తున్న రెండు లారీలు ఒక బొలెరో వాహనం రహదారి మధ్యలో డివైడర్పై బోల్తా పడ్డాయి ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు

Conclusion:నవీన్ కుమార్ ఈ టీవీ రిపోర్టర్ పాణ్యం కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.