విజయనగరం జిల్లా సాలురులో మున్సిపల్ ఛైర్ పర్సన్, హౌసింగ్ బోర్డు అధికారులు 28,29 వార్డు గృహలబ్ధిదారులతో నిర్వహించిన సమావేశం రసాభాసాగా మారింది. ఆర్నెళ్ల క్రితం పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తామన్నారని.. ఇప్పుడేమో తమనే కట్టుకోమని చెబుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లకు బిల్లులివ్వలేదని.. ఇప్పుడు నిర్మించే ఇళ్లకు ఇస్తారని నమ్మకమేంటని లబ్ధిదారులు.. అధికారులను ప్రశ్నించారు.
వారంతా చైర్‌పర్సన్‌ను నిలదీయడంతో ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ముగియకుండానే అక్కడినుంచి వెనుదిరిగారు.
ఇదీ చదవండి: భూ సమస్యలకు ఇక శాశ్వత పరిష్కారం: ధర్మాన