ETV Bharat / state

అరటి గెలల ఆటో బోల్తా.. వ్యక్తి మృతి - భోగాపురంలో ఆటో బోల్తా

లాక్ డౌన్ ముగిసింది.. ఇక వ్యాపారం తిరిగి మొదలుపెడదాం అనుకున్నాడు... వ్యాపారానికి కావల్సిన అరటి గెలలు కొనేందుకు ఆటోలో వెళ్లాడు. గెలలు కొని తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడడంతో మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై జరిగింది.

auto roll over person died in bhoghapuram vizianagaram district
రోడ్డుప్రమాదంలో చనిపోయిన వ్యక్తి
author img

By

Published : Jun 21, 2020, 7:33 PM IST

Updated : Jun 21, 2020, 7:55 PM IST

అరటి గెలల లోడుతో వస్తున్న ఆటో అదుపుతప్పి ఓ వ్యక్తి మృతిచెందాడు. విజయనగరం జిల్లా అనందపురం మండలం దుక్కవానిపాలేనికి చెందిన చిన్నారావు అరటి కాయల వ్యాపారం చేస్తుంటాడు. గెలలు కొనడానికి వరుసకు మేనల్లుడైన శ్రీరామ్ ఆటోలో రణస్థలం వెళ్లాడు. గెలలు కొని ఆటోలో వేసుకుని తిరిగి వస్తుండగా భోగాపురం మండలం పోలిపల్లి జాతీయ రహదారి వద్ద అదుపుతప్పి డివైడర్​ను ఢీకొంది. ఈ ఘటలో చిన్నారావు(55) మీద ఆటో పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ శ్రీరామ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి...: 'గంటా నవీన్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి'

Last Updated : Jun 21, 2020, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.