రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై దాడులు జరగడం బాధాకరమన్నారు విజయనగరం జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు. ఎంతో చరిత్ర కలిగిన అంతర్వేదిలో రథం దగ్ధం కావడం బాధాకరమన్నారు. ఈ ఘటనను అన్ని మతాలవారు, ప్రాంతాలవారు ఖండిస్తున్నారన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇందుకు పాల్పడిన వారిని శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రశాంత వాతావరణాన్ని అందరూ సమానంగా తీసుకుంటూ..ఏ మతస్థులు ఏ కార్యక్రమం చేసినా అడ్డుకునే పరిస్థితి రాకూడదన్నారు.
ఇవీ చదవండి: రోడ్డు కోసం డోలీలతో గిరిజనుల నిరసన