ETV Bharat / state

'భవిష్యత్ బాగుండాలంటే.. వారిని ఇంటికి పంపించండి' - విజయనగరంలో అశోక్ గజపతిరాజు ఎన్నికల ప్రచారం వార్తలు

రాష్ట్రంలో రాజకీయ సన్యాసులు ప్రవేశించిన ప్రతిచోట ప్రజలకు ఇబ్బందులేనని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు విజయనగరం కో-ఆపరేటివ్ బ్యాంకు, మాన్సాస్ ట్రస్టు వ్యవహారం నిదర్శనమని అన్నారు. విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తెదేపా అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.

ashok gajapatiraju campaign at vizianagaram
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతి
author img

By

Published : Mar 6, 2021, 12:46 PM IST

విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు 30వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ ఆదిబాబుకు మద్ధతుగా ప్రచారం చేపట్టారు. ధర్మపురి ఆంజనేయస్వామి ఆలయం నుంచి రామాలయం వీధివరకు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. డివిజన్ కౌన్సిలర్ ఆదిబాబు, తెదేపా మేయర్ అభ్యర్ధి శమంతకమణిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

రాజకీయ సన్యాసులు ప్రవేశించిన వ్యవస్థలన్నీ రాష్ట్రంలో నిర్వీర్యమయ్యాయని... ఇందుకు విజయనగరం సహకార బ్యాంకు, మాన్సాస్ ట్రస్టు నిదర్శనమన్నారు. రానున్న ఏప్రిల్ నుంచి పురపాలికల్లో ఆస్తిపన్ను పెంచబోతున్నారని.. ఇక పేదలు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. భవిష్యత్ బాగుండాలంటే.. వాళ్లను ఇంటికి పంపించండని ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

నన్ను విమర్శిస్తే ఊరుకోను: ఎమ్మెల్యే బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.