విజయనగరం పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ.. మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి రాజు, మరో 12 మంది హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. జీతాలు ఇవ్వాలని అడిగినందుకు అన్యాయంగా కేసు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయమై... పూర్తి వివరాలు కావాలని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని కోరింది. వివరాలు తెలిపేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరారు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.
ఇదీ చదవండి:
MANSAS TRUST: బకాయిలు చెల్లించాలని మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగుల ఆందోళన
Mansas Trust: చైర్మన్ ఆదేశాలు పాటించాల్సిందే: మాన్సాస్ ట్రస్టు ఈవోకు హైకోర్టు ఆదేశం