మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్మన్గా సంచయిత నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ సంస్థల పూర్వ ఛైర్మన్ అశోక్ గజపతి రాజు విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యుల సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు, మర్యాదపూర్వకంగా పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అశోక్ గజపతి రాజుతో పాటు తెదేపా శ్రేణులు అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు ఇకనైనా జ్ఞానం ప్రసాదించాలని అమ్మవారికి మొక్కుకున్నామని అశోక్ గజపతిరాజు అన్నారు. రెండేళ్ల కాలంలో ఎన్నో అలజడులు సృష్టించారని విమర్శించారు. "నాపై కక్ష కట్టారు. సింహాచలం దేవస్థానంలోని గోశాల దేశానికే ఆదర్శం.. అలాంటి ప్రదేశంలోని గోవులను నిర్బంధించి హింసించి చంపేశారు" అని ఆవేదన చెందారు.
మాన్సాస్ సంస్థలోనూ నష్టాలు జరిగాయి. ట్రస్టు ఆధ్వర్యంలోని 105 ఆలయాల్లో ఎలాంటి ఇబ్బంది కలిగిందో తెలియదు. పైడితల్లి ఆలయం, రామతీర్థం, సింహాచలం ఆలయాలకు వచ్చే ఆదాయంలో 17 శాతం పరిపాలన, నిర్వహణ, సంరక్షణ కోసం దేవాదాయ శాఖకు వెళ్తుంది. ఇది ఏ మేరకు అమలు చేశారో పరిశీలించాల్సి ఉంది. చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉందని మరోసారి రుజువైంది. - అశోక్ గజపతిరాజు, మాన్సాస్ ట్రస్టు పూర్వ ఛైర్మన్
ఇదీ చదవండి: