మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని తూర్పు గోదావరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఛైర్మన్గా కొనసాగుతున్న తనని తొలగించి.. సంచైత గజపతిని నియమించటంపై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. విజయనగరంలో మాట్లాడిన ఆయన.. తూర్పు గోదావరి దేవాలయాలకు అధ్యక్షురాలిగా సంచైత గజపతిని నియమించడం చట్టరీత్యా వ్యతిరేకమన్నారు.
ఎలాంటి సమాచారం లేకుండా బోర్డు నియమించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇదంతా రాజకీయ కక్షతో చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని దేవాలయాలపై కన్ను పడిందని దుయ్యబట్టారు. అన్ని మతాలను ప్రభుత్వం గౌరవించాలని, ఒక్కో మతాన్ని ఒక్కో విధంగా చూడటం శుభం కాదన్నా రు.
ఇదీ చదవండి: