గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ... ఇవాళ ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఏపీ టీఎన్ఎస్ఎప్ పిలుపునిచ్చింది. ఈ మేరకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ. ప్రణవ్ గోపాల్, ఏపీ విద్యార్ధి యువజన జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ ఆరేటి మహేష్ లను విశాఖలో ముందస్తుగా అరెస్ట్ చేశారు.
వీరిద్దరినీ విశాఖపట్నం ఎంవీపీ జోన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన టీఎన్ఎస్ఎఫ్ యువత అధ్యక్షుడు కుమిలి ప్రసాద్ ను ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం గరివిడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: