- అమరావతి రైతులపై అడ్డగోలు దుష్ప్రచారం!
Propaganda against Amaravati farmers: విభజిత అవశేషాంధ్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన అన్నదాతల పెద్దమనసునే చిన్నబుచ్చుతున్న వైనమిది. ఆ రైతులంతా త్యాగధనులా, స్వార్థపరులా అనే అంశాన్ని రాష్ట్ర సర్కారు చర్చకు పెట్టింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని గత ప్రభుత్వం త్యాగధనులుగా కీర్తిస్తే, ప్రస్తుత వైకాపా సర్కారు స్వార్థపరులని, భూస్వాములని నమ్మబలుకుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంచు కురిసే వేళ ప్రయాణమా..? ఇవి పాటించకుంటే ప్రమాదమే..!
Safety Measures while driving in fog : శీతాకాలంలో పొగమంచు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. రహదారులపై దట్టంగా పొగ మంచు కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక జరిగే ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. భద్రతే లేదు..
Condition of Contract Employees of Health Department: పేరుకే ప్రభుత్వ ఉద్యోగం. చనిపోతే పట్టించుకునే దిక్కేలేదు. సర్కార్ కొలువంటూ రేషన్ కార్డ్ తీసేశారు. పథకాలు ఇవ్వడమూ ఆపేశారు. 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే ఉన్నా.. గుర్తింపు లేదని పెదవి విరుస్తున్నారు. వెట్టిచాకిరీ చేయించుకున్నా ఉద్యోగ భద్రత లేదని ఆవేదన చెందుతున్నారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సంకల్ప్ సిద్ధి..భారీ స్కామ్‌లో ఇద్దరు ప్రజాప్రతినిధులు..!
Sankalp Siddhi Mart Multilevel Cheating Case: "ఈ ప్రపంచంలో ధనవంతుడు మరింత డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి”.. "కానీ పేదవాడు ధనవంతుడు కావడానికి ఉన్న ఏకైక మార్గం కేవలం సంకల్ప్ మార్ట్" అంటూ ప్రకటనలు గుప్పించారు. ఆకర్షణీయ నినాదాలతో, మనీ సర్కులేషన్ పథకాలతో డిపాజిటర్లలను ఆకట్టుకున్నారు. ఏడాదిలోనే 11 వందల కోట్లు వసూలు చేసి, బోర్డు తిప్పేసేందుకు సిద్ధమయ్యారు. అంతా అయిందనుకున్న దశలో దొరికిపోయారు. ఈ భారీ మోసం వెనుక ఇద్దరు ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒకేసారి 3,003 వివాహాలు.. స్పెషల్ గిఫ్టులు ఇచ్చి మరీ చేయించిన ప్రభుత్వం
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో 3,003 జంటలు ఒక్కటయ్యాయి. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లో పుట్టిన మరో 'మెస్సీ'!.. అభిమానాన్ని చాటుకున్న కేరళ జంట
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో తమ అభిమానాన్ని చాటుకుంది ఓ జంట. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పేరును తమ తనయుడికి పెట్టి ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పన్ను మినహాయింపు కావాలా? వీటిలో పెట్టుబడులు పెట్టేయండి! Tax Reduction Techniques : మరో నాలుగు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. పన్ను భారం తగ్గించుకునేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టాల్సిన తరుణమిది. పన్ను మినహాయింపు ఒక్కటే లక్ష్యం కాకుండా.. పెట్టుబడులు భవిష్యత్తులో ఆర్థిక భరోసా కల్పించేలా ఉండాలి. సరైన పన్ను-పెట్టుబడి పథకంలో మదుపు చేసినప్పుడే ఇది సాధ్యం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అదిరిపోయిన 'జై బాలయ్య' సాంగ్.. బాలకృష్ణ ఫ్యాన్స్‌కు వీకెండ్లో 'ట్రిపుల్' ధమాకా
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. బాలయ్య హీరోగా రూపొందుతోన్న 'వీరసింహారెడ్డి' సినిమా నుంచి తొలిపాటను చిత్రబృందం రిలీజ్ చేసింది. 'జై బాలయ్య' అంటూ సాగే ఈ పాట ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 40 ఏళ్లు వచ్చినా ఈ ముద్దుగుమ్మల క్రేజ్ మామూలుగా లేదుగా
కాజోల్, శిల్పా, ఐశ్వర్య, జూహీ ఇలా చెప్పుకుంటూ పోతే 90స్లో కుర్రకారుకు కిర్రెక్కింటిన డ్రీమ్ గర్ల్స్ ఎందరో. ఆ దశకంలో వీరి నటనకు ఫిదా అయిన యువత ఇప్పటికీ వీరినే అభిమానిస్తుంటారు. అయితే తమ నలభైవ ఏటలోనూ వెన్నెల లాంటి అందాలను చిందిస్తూ ఈ తరం స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తున్న మన 90స్ స్టార్స్ లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేద్దామా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.