ETV Bharat / state

YCP-Janasena flexi controversy: పోటాపోటీగా వైసీపీ, జనసేన ఫ్లెక్సీలు.. పలుచోట్ల ఉద్రిక్తత - ycp aganist janasena

Flexi dispute between JanaSena and YSRCP: రాష్ట్రంలో అధికార పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్) జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీ వివాదం ముదిరింది. తమ పార్టీ అధినేతనే కించపరుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారా..? అంటూ వైసీపీ శ్రేణులు, జనసైనికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Ycp-janasena flex
Ycp-janasena flex
author img

By

Published : May 29, 2023, 5:29 PM IST

Updated : May 29, 2023, 5:45 PM IST

వైసీపీ, జనసైనికుల మధ్య ముదిరిన ఫ్లెక్సీ వివాదం

Flexi dispute between Janasena and YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్) జనసేన పార్టీ మధ్య ఫ్లెక్సీ వివాదం ముదురుతోంది. తమ పార్టీ అధినేతను కించపరుస్తూ.. ఇష్టారీతిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారా..? అంటూ జనసైనికులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే జనసేన పార్టీకి వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారో.. అదేచోట వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా జనసైనికులు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో జనసైనికులపై కోపోద్రిక్తులైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. కొన్ని చోట్ల ఫ్లెక్సీలను చించేశారు. మరికొన్ని చోట్ల జనసేన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు.

ఒంగోలులో మొదలైన ఫ్లెక్సీ వివాదం.. ఒంగోలు జిల్లాలో ఆదివారం రోజున జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ వివాదం మొదలైంది. మొదటగా 'పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్దం' పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒంగోలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనసేన అధినేతకు వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో.. ఒకవైపు సీఎం జగన్ పేదల పక్షం వహిస్తున్నట్లు.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ కూర్చున్న పల్లకిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, కొందరు మోస్తున్నట్లు చిత్రాలను చిత్రీకరించారు. వాటిపై ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు.. 'రాక్షస పాలనకు అంతం-ప్రజా పాలనకు ఆరంభం' పేరుతో ఈరోజు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో.. సీఎం జగన్ ఒక చేతిలో గొడ్డలి.. మరో చేతిలో వైఎస్ వివేకానంద రెడ్డి తల పట్టుకొని ఉండగా.. దుష్ట శక్తులపై పవన్ కల్యాణ్ విల్లు ఎక్కుపెట్టినట్లు చిత్రాలు చిత్రీకరించారు.

Pawan on New Parliament Building: భరతమాత మెడలో మరో మణిహారం సెంట్రల్ విస్టా : పవన్ కల్యాణ్

విజయనగరంలో జనసైనికుల ఆందోళన.. జనసేన పార్టీకి వ్యతిరేకంగా వెలసిన ప్లెక్సీలకు నిరసనగా విజయనగరం జిల్లాలో జనసైనికులు ఆందోళనకు దిగారు. అనంతరం వాటి పక్కనే జనసైనికులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీల్లో "ఔనౌను.. జగన్ చాలా పేదవాడు" అనే పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం అయినా, సీఎం అయినా వారు చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేసుకుంటారు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రజలు, ప్రాంతాలు, యువకుల, వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తోంది. ఈ విధానాలు సరైనవి కావు. ఆ పార్టీ నేతలకు తెలియచేసేందుకే వైఎస్సార్సీపీ ప్లెక్సీలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ప్లెక్సీలను ప్రదర్శించాము'' అని వారు అన్నారు.

ఫ్లెక్సీలు తొలగించాలి-బాధ్యులను శిక్షించాలి.. మరోపక్క విజయనగరంలో ఈరోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు జనసేనకు వ్యతిరేకంగా.. విజయనగరంలోని విశాఖ ప్రధాన రహదారి ఎత్తుతో పాటు బాలాజీ కూడలి, కోట, న్యూ పూర్ణ థియేటర్, మయూరి కూడలి, దాసన్నపేట రైతు బజారు వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలపై జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ మనోభావాలను కించపరిచేలా వేసిన ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని, బాధ్యులను గుర్తించి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు వినతిపత్రాలను అందించారు. దీంతో అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో వైఎస్సార్సీపీ ప్లెక్సీల పక్కనే జనసైనికులు వ్యతిరేక ప్లెక్సీలను ప్రదర్శించారు.

YSRCP Leaders Attack on TDP Activists: టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి.. దారి కాచి మరి..

పోలీసులపై జనసైనికులు ఫిర్యాదులు.. విషయం తెలుసుకున్న అధికార పార్టీ కార్యకర్తలు జనసేన ఫ్లెక్సీలను చూసి.. కోపోద్రిక్తులై వాటిని చించివేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టి.. జనసేన ప్లెక్సీ‌లను మున్సిపల్ అధికారుల చేత తొలగించేశారు. దీనిపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహించారు. పోలీసుల అధికారుల తీరును దుయ్యబట్టరు. నిరసనగా ర్యాలీగా వెళ్లి పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

Illegal layouts in Nellore: నుడా అనుమతి లేకుండా 100కుపైగా అక్రమ లేఅవుట్లు.. అధికార పార్టీ అండతోనే..!

Last Updated : May 29, 2023, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.