విజయనగరం జిల్లా పాత భీమసింగిలోని ఎస్సీ కాలనీలో.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం కుడిచేతి వేళ్లు ధ్వంసమయ్యాయి. విషయాన్ని గమనించిన స్థానికులు.. సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
కాలనీవాసుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని.. విగ్రహాన్ని పరిశీలించామని ఎస్సై సుదర్శన్ చెప్పారు. దర్యాప్తు చేపడతామన్నారు. ఘటనపై కాలనీవాసులు నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: