డాక్టర్ అంబేడ్కర్ 130వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ రాజకుమారి పాల్గొన్నారు. బాలాజీ జంక్షన్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. విద్యార్థులు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఏకైక లక్ష్యం విద్యని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబాటుతనం పోవాలంటే విద్యే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీలు కిషోర్ కుమార్, వెంకటరావు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. ఆధునిక భారతదేశం కోసం అంబేడ్కర్ నిరంతర పోరాటం చేశారు: గవర్నర్