విజయనగరం జిల్లా భోగాపురం వెలుగు సమాఖ్య భవనంలో డిజిటల్, వెల్ఫేర్, వీఆర్వోలకు.. ఎంపీడీవో ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి సచివాలయాల ద్వారానే పనులు జరగాల్సి ఉందని... ఇందుకు ఉద్యోగులంతా సంసిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రజలకు అందించే సేవల్లో ఉద్యోగులు నిర్లక్ష్యం వహించరాదన్నారు.
రాష్ట్రంలో ఈ జిల్లా ఎంతో ఆదర్శప్రాయంగా ఉందని.. మరోసారి పనితీరుతో నిరూపించుకోవాలని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయిలో ఉండే ప్రజలు కేవలం సచివాలయ కేంద్రానికి రావాలే తప్ప.... ఇతర ప్రాంతాలకు వెళ్లి వారి పని చేయించుకునేలా ఉండకూడదన్నారు. ఉప తహసీల్దారు గాంధీ బంగారయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: