పంచాయతీలో.. 'పెళ్లి చేసుకొనే అమ్మాయికి పావు తులం బంగారం, పెళ్లిలో అమ్మాయి, అబ్బాయి ఊరేగింపునకు కారు ఉచితం, ఆడపిల్ల రజస్వలు అయితే భోజన ఖర్చులకు రూ. 10 వేలు, ఆసుపత్రిలో చికిత్స రూ.20 వేలు మించితే రూ. 5 వేలు ఆర్థిక సాయం'.. ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా.. ఏదైనా రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో అనుకుంటున్నారా.. అస్సలే కాదు. విజయనగరం జిల్లా గొల్లలపేటలో సర్పంచి బరిలో నిలవాలనుకుంటున్న వ్యక్తి విడుదల చేసిన మేనిఫెస్టో. ఇవేనా..! ఇంకా చాలానే ఉన్నాయ్.
గ్రామంలో ఎవరైనా మరణిస్తే దహనానికి రూ. 5 వేలు, ప్రతి సంక్రాంతికి ఆడపిల్లలకు గాజుల కోసం రూ. 500, ఆలయాల్లో దీపం ఖర్చు, ఎవరైనా పక్షవాతానికి గురై మంచాన పడితే నెలకు రూ. 500 పింఛను ఇస్తానని ఆ వ్యక్తి హామీల మీద హామీలు ఇస్తున్నారు. గ్రామ పంచాయతీ మేనిఫెస్టో పేరుతో ఓ లేఖ స్థానికంగా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై వైకాపా ఆశలు నీరుగారాయి: చంద్రబాబు