కల్వర్టు పనులు చేసున్న సమయంలో స్లాబ్ కూలటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ సమీపంలో జరిగింది. పార్వతీపురం పురపాలక సంఘం గొల్ల వీధికి చెందిన శ్రీనివాసరావు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కల్వర్ట్ కింద ఏర్పాటు చేసిన కర్రలను తొలగిస్తుండగా స్లాబ్ కూలింది . లోపల ఇరుక్కున్న బాధితుడితో పాటు... మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు . అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ...కనిపించకుండా పోయిన చిరు వ్యాపారి.. మృతదేహమై తేలాడు!