విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం కేఆర్ఎం వలస అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన రెండేళ్ల బాలుడు జశ్విక్ చేత మాత్ర ముక్క మింగించి నీళ్లు తాగించారు. కొద్దిక్షణాలకే బాలుడు అపస్మారక స్థితికి చేరాడు. హుటాహుటిన బాలుడిని పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మాత్ర ముక్క గొంతులో ఇరుక్కు పోయినందున ఊపిరాడక పిల్లవాడు మృతి చెంది ఉంటాడని వైద్యులు అన్నారు. మాత్రను మింగుతున్న సమయంలో మూర్ఛ వచ్చి ఉండవచ్చని కొంతమంది భావిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లముందే చనిపోవడంతో... తల్లిదండ్రులు సుజాత, చంద్రశేఖర్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి... మార్కెట్లోకి 'మేడిన్ ఆంధ్రా' కారు