విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముష్టిపల్లి కూడలి వద్ద ఓ ఐచర్ వ్యాన్లో గోనెసంచుల మాటున గంజాయి తరలిస్తున్న ముఠాను ఎస్.కోట పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు ఈ సాయత్రం ముష్టిపల్లి కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. గోనె సంచులతో వెళ్తున్న ఐచర్ వ్యాన్(లారీ)లో 50 గంజాయి బస్తాలు గుర్తించారు. దాని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో పాత్రధారులైన నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఇద్దరు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశామని.. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 50 సంచుల గంజాయి, లారీ ఐచర్ వ్యాన్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఎక్కనుంచి ఎక్కడికి...
జిల్లాలో ముంచంగిపుట్టు మండలం పరిసరాల నుంచి ఈ గంజాయి కొనుగోలు చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తరలించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు విచారణలో తెలింది. అరకు ప్రాంతం నుంచి శృంగవరపుకోట మీదుగా జాతీయ రహదారికి మార్గం ఉండటంవల్ల ఈ దారిలో ఎక్కువగా గంజాయి రవాణా జరుగుతుంది. శృంగవరపుకోట పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ ఏడాదిలో మొత్తం 21 కేసుల్లో 1840 కిలోల గంజాయి పట్టుబడింది.
పిల్లలపై దృష్టి పెట్టాలి...
విద్యార్థులు, యువకులు అరకు వచ్చే అక్కనుంచి చిన్న మొత్తంలో గంజాయి తరలిస్తూ.. దాని బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో విజయనగరం డీఎస్సీ వీరాంజనేయ రెడ్డి, సీఐ బి. శ్రీనివాసరావు, ఎస్సై నీలకంఠం పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
స్వామీజీలకు ప్రభుత్వం లొంగిపోయిందా..?: సీపీఐ రామకృష్ణ