విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో 122, గిరిజన ఆశ్రమ పాఠశాలతోపాటు, 26 గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. కొవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నవంబర్ మొదటి వారంలో పాఠశాలలు తెరిచి విద్యాబోధన ప్రారంభించారు. కానీ మన్యంలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావటంలేదు. కరోనా భయానికి తోడు, వ్యవసాయ పనుల్లోకి విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకెళ్తుండటంతో విద్యార్థులు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి.
ప్రధానోపాధ్యాయులకు షోకాజు నోటీసులు
ఈ అంశంపై దృష్టి సారించిన గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు విజయ్ కుమార్...జీరో విద్యార్థుల అటెండెన్స్ ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచిస్తున్నారు.
కరోనా నివారణ చర్యలు చేపట్టినా..
పాఠశాలల్లో కరోనా సోకకుండా విద్యార్థులకు అన్ని వసతులు కల్పించినా వారు పాఠశాలలకు హాజరు కావటంలేదు. తల్లిదండ్రులు కూడా కరోనా భయంతో వారిని పాఠశాలలకు పంపించడానికి విముఖత చూపుతున్నారు. ఉపాధ్యాయలు మాత్రం..విద్యార్థులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూస్తామని..., మెనూ ప్రకారం మధ్యహ్న భోజనాన్ని అమలు చేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు సహకరించి పూర్తిస్థాయిలో విద్యార్థులను పాఠశాలకు పంపిస్తే...ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేలోగా నాణ్యమైన విద్యనందిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: