ETV Bharat / state

'మావోయిస్టులకు కాదు... అభివృద్ధికి సహకరించండి' - balapam panchayat news

మావోయిస్టులకు సహకరించవద్దని విశాఖ మన్యంలోని గిరిజనులను పోలీసు అధికారులు కోరారు. యువ‌హో కార్య‌క్ర‌మంలో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బలపం పంచాయతీ చెరువూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం, మెగా వాలీబాల్ టోర్న‌మెంట్​ను నిర్వ‌హించారు.

yuva ho program
yuva ho program
author img

By

Published : Nov 9, 2020, 6:32 PM IST

మావోయిస్టుల‌కు స‌హ‌క‌రించ‌డం వ‌ల్ల ఎటువంటి అభివృద్ధి సాధించలేరని గిరిజనులకు విశాఖ జిల్లా ఓఎస్‌డీ స‌తీష్‌ కుమార్ సూచించారు. మన్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బలపం పంచాయతీ చెరువూరు గ్రామంలో యువ‌హో కార్య‌క్ర‌మంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం, మెగా వాలీబాల్ టోర్న‌మెంట్​ను సోమవారం నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఓఎస్‌డీ స‌తీష్‌కుమార్ హాజరయ్యారు.

మన్యంలోని 11 మండ‌లాల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రభుత్వ పథకాలను అందరికి అందేలా చూసే బాధ్య‌త‌ను గ్రామాల్లోని యువ‌త తీసుకోవాల‌ని సతీష్ కుమార్ సూచించారు. మరోవైపు మావోయిస్టులు కనీసం అంగ‌న్‌వాడీ కేంద్రాన్ని కూడా తీసుకురాలేర‌ని చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగ‌ర నాయుడు అన్నారు. కార్య‌క్ర‌మం అనంత‌రం పోలీసు అధికారులు గిరిజ‌నుల‌తో సంహ‌పంక్తి భోజ‌నం చేశారు.

ఇదీ చదవండి

అసంపూర్తిగా వంతెనల నిర్మాణాలు..ప్రజలకు తప్పని కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.