రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో అధికారం చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి తాను చేపట్టిన పాదయాత్ర లో ప్రజల కష్టాలను గుర్తించి.. వాటిని పరిష్కరించేలా పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎం పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా విశాఖ జిల్లా అనకాపల్లిలో వైకాపా కార్యాలయంలో 'ప్రజల్లో నాడు.. ప్రజల కొసం నేడు' కార్యక్రమంలో భాగంగా కేక్ కట్‌చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్, వైకాపా రాష్ట్ర కార్యదర్శి దంతులూరి కుమార్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 219 మందితో తెదేపా రాష్ట్ర కమిటీ ఏర్పాటు