ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మన్యంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. విశాఖ మండలం కోడిమామిడి గడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో.. రాకపోకలు స్తంభించాయి. ఆ వాగుకు అవతలి ప్రాతాల వారు ఆసుపత్రికి వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు. కిల్లంకోట పంచాయతీ సుర్తిపల్లికి చెందిన చిన్నతల్లి(60) అనే వృద్ధురాలు అనారోగ్యానికి గురైంది. ఓపక్కగడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆమెను ఆసుపత్రికి తీసుకవెళ్లాలంటే..గడ్డ దాటి పక్క ఊరికి వెళ్లాలి. అక్కడి యువకులు సాహసించి ఆమెను మంచంపై ఉంచి ప్రవాహంలో అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి జి.మాడుగుల ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. ఎన్నో ఏళ్లుగా మన్యంలో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు. తమ ప్రాణాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కృష్ణాబోర్డుకు వివరాల సమర్పణ