విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వద్ద వాటర్ టాంక్ ఎక్కి యువతి హల్చల్ చేసింది. పెద్ద బొడ్డేపల్లి గ్రామానికి చెందిన సంతోషి అనే మహిళ ఇక్కడికి సమీపంలోని బలిఘట్టం గ్రామానికి చెందిన కోడి రవి అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు ఈ రోజు మధ్యాహ్నం బంధువుల కోసం నర్సీపట్నం ప్రాంత ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో ప్రియుడు రవి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మనస్థాపం చెందిన సంతోషి.. ప్రియుడితో వివాహం జరిపించాలని, లేదంటే చనిపోతానని ఆసుపత్రి ప్రాంగణంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రియుడు రవిని వెతికి తీసుకు వచ్చారు. మెగా ఫోన్ ద్వారా అతడు మాట్లాడిన అనంతరం సంతోషి ట్యాంక్ దిగి వచ్చింది. వీరిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఇదీ చదవండి: