ETV Bharat / state

ఏలేరు కాలువలో యువకుడి మృతదేహం - visakha crime news

విశాఖ జిల్లా మాకవరపాలెం సమీపంలోని ఏలేరు కాలువలో ఓ యువకుడి మృతదేహాన్ని మాకవరపాలెం పోలీసులు గుర్తించారు. అనుమానస్పద మృతిగా చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

young deadboy found in eluru canal
ఏలేరు కాలువలో యువకుడి మృతదేహం
author img

By

Published : Mar 20, 2021, 6:29 PM IST

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం తోటిపాల గ్రామంలో విషాదం నెలకొంది. శుక్రవారం నుంచి బయటకు వెళ్లిన గవిరెడ్డి వెంకటరమణ అనే యువకుడు అదే రోజు రాత్రి మాకవరపాలెం సమీపంలోని ఏలేరు కాలువలో శవమై తేలాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న మాకవరపాలెం పోలీసులు.. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా ? లేదా హత్యా, ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:

ఉక్కు పోరు: కార్మిక మహాగర్జనకు ర్యాలీగా కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.