ETV Bharat / state

YCP Leaders Land irregularities in Visakhapatnam: విశాఖలో వైసీపీ నేతల భూ అక్రమాలు.. చివరకి పేదల భూములనూ వదలటం లేదు.. - YSRCP Leaders Land Grabs

YCP Leaders Land irregularities in Visakhapatnam: విశాఖలో కొండలు కబ్జా చేసి, ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టేసిన అధికార పార్టీ నేతల కన్ను ఇప్పుడు.. పేదలు నివాసముండే మురికివాడలపై పడింది. ఆయా స్థలాలకు టీడీఆర్​ పేరుతో 1,220 కోట్ల బాండ్లను దక్కించుకునేందుకు వ్యూహం పన్నారు. ఈ మేరకు తాడేపల్లి ఆదేశాలతో దస్త్రాలు వేగంగా కదులుతున్నాయి. ఆగమేఘాలపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు.

YCP_Leaders_Land_irregularities_in_Visakhapatnam

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 9:36 AM IST

YCP Leaders Land irregularities in Visakhapatnam: విశాఖలో వైసీపీ నేతల భూ అక్రమాలు.. చివరకి పేదల భూములనూ వదలటం లేదు..

YCP Leaders Land irregularities in Visakhapatnam: విశాఖలో వైసీపీ నేతల దందాలు అన్నీఇన్నీ కావు.. ఎక్కడైనా ప్రభుత్వ భవనాల అవసరాలకు, అభివృద్ధి పనులకు భూమి సేకరించినప్పుడు టీడీఆర్ బాండ్లు జారీ చేస్తారు. విశాఖలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా పలు కుటుంబాలు నివాసం ఉంటోన్న మురికివాడలు ప్రైవేటు వ్యక్తులవని.. వాటిని ఖాళీ చేయించలేరు కనుక ఆయా స్థలాలకు టీడీఆర్​లు ఇవ్వాలంటూ చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే పెదజాలారిపేటలోని 20.27 ఎకరాల భూములు రాణిసాహిబా వాద్వాన్‌వి అని, వాటి మార్కెట్‌ ధరకు నాలుగు రెట్లు టీడీఆర్‌ బాండ్లు జీవీఎంసీ మంజూరు చేయాలని కోరడం.. అధికారుల సర్వే చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అదే తరహాలో మరో మూడు దస్త్రాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ముందుకు కదులుతున్నాయి. ఈ బాండ్లను వెంటనే మంజూరు చేయాలంటూ తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

విశాఖ సీతమ్మధార సమీపంలో రేసపువానిపాలెం సర్వే నంబరు 7లో 3.11 ఎకరాలు, 0.76 ఎకరాలు ఆంధ్రా బ్యాంకు హౌసింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీకి చెందిన భూమిగా దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి 3.11 ఎకరాల్లో బిలాల్‌ కాలనీ ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలు నాలుగు దశాబ్దాలకు పైగా ఇక్కడ నివసిస్తున్నారు. ఈ భూమి సొసైటీకి చెందుతుందని, ప్రస్తుత మార్కెట్‌ ధరకు నాలుగు రెట్లు లెక్కగట్టి 1,000 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లు మంజూరు చేయాలంటూ దరఖాస్తు వచ్చినట్లు సమాచారం.

Land Occupation: ఆ మంత్రుల నియోజవర్గాల్లో యథేచ్ఛగా భూ అక్రమాలు..

ఓ వైసీపీ నేత తన వ్యాపార భాగస్వామి బంధువు ద్వారా ఈ వ్యవహారం నడుపుతున్నారు. ఈ దస్త్రం జీవీఎంసీ ఈ-ఆఫీస్‌లో 199568 నంబరుతో ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. 2016లో బిలాల్‌ కాలనీలోని భూమి సొసైటీదంటూ అప్పట్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు ఆ భూములకే టీడీఆర్‌లు ఇచ్చేందుకు జీవీఎంసీ ముందుకెళ్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీఎంఆర్‌ గోదాం వెనుక వైపు పాత 20వ వార్డులోని వెంకటపతిరాజు నగర్‌ మురికివాడలో 0.76 ఎకరాలు ప్రైవేటు వ్యక్తికి చెందినదిగా పేర్కొంటూ మరో దరఖాస్తును తెరపైకి తెచ్చారు.

వాస్తవానికి మురికివాడల్లో టీడీఆర్‌లు ఇవ్వాల్సి వస్తే 1:1 నిష్పత్తిలో చెల్లించాలి. అందుకు విరుద్ధంగా స్థలం విలువకు నాలుగు రెట్లు అంటే దాదాపు వంద కోట్లు టీడీఆర్‌ బాండ్లు ఇవ్వాలంటూ ప్రతిపాదన పెట్టారు. మురికివాడల ముసుగులో టీడీఆర్‌ కుంభకోణాలు జరుగుతున్నాయని జనసేన కార్పోరేటర్‌ మూర్తియాదవ్‌ ఆరోపించారు.

Temple lands: ఆలయ భూములపై అధికార పార్టీ నేతల కన్ను.. లీజు పేరుతో 9 ఎకరాలకు టోకరా

"రేసపువానిపాలెం సర్వే నంబరు 7, సీతమ్మధార మండలంలోని బిలాల్​ కాలనీ.. ఆంధ్రా బ్యాంకు హౌసింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీకి చెందింది. విశాఖ ఎంపీ ఎంవీవీ.. పేద మురికి వాడగా ఉన్నా బిలాల్ కాలనీని కొట్టేసే ప్రయత్నం ఆగమేఘాల మీద జరుగుతోంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ వెలుగులోకి తీసుకువస్తోంది." -​మూర్తియాదవ్, జనసేన నేత

మధురవాడ బక్కన్నపాలెం సమీపంలో సర్వే నెంబరు 2లో జీవీఎంసీ దాదాపు ఐదేళ్ల క్రితమే రోడ్డు అభివృద్ధి చేసింది. ఎప్పుడో నిర్మించిన ఈ రోడ్డు విస్తరణలో తమ భూమి 2 ఎకరాలు కోల్పోయామని, టీడీఆర్‌ బాండ్లు 120 కోట్లకు ఇవ్వాలంటూ ఇప్పుడు దరఖాస్తు వచ్చింది. దీని వెనుక రాయలసీమకు చెందిన కొందరు నాయకులు చక్రం తిప్పారు. ఈ బాండ్లను వెంటనే మంజూరు చేయాలంటూ తాడేపల్లి నుంచి సైతం ఆదేశాలొచ్చినట్లు తెలుస్తోంది.

ఆగమేఘాలపై రోడ్డు మ్యాప్‌లు తీసుకుని ఏపీసీ, సర్వేయర్‌తో కలిసి ఇటీవల కమిషనర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మూడు దస్త్రాలపై ప్రధాన పట్టణ ప్రణాళిక అధికారిణి వి.సునీతను వివరణ కోరగా.. సమాధానం చెప్పడానికి నిరాకరించారు. తాడేపల్లి ప్యాలెస్‌ ఒత్తిళ్లతోనే ఇష్టారాజ్యంగా టీడీఆర్‌లు ఇస్తున్నారని జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ఆరోపించారు.

TDR bonds: టీడీఆర్‌ బాండ్లలో భారీ అక్రమాలు.. కోట్లు దోచుకుంటున్న అధికార పార్టీ నాయకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.