విశాఖపట్నం జిల్లా (visakha district) నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా(kagita toll plaza)వద్ద ఉద్రిక్తత నెలకొంది. టోల్ ప్లాజా రుసుము చెల్లించే విషయమై వైకాపా నాయకులకు, టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో.. ఓ టోల్ ప్లాజా ఉద్యోగి గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పాయకరావుపేటకు చెందిన కొందరు వైకాపా నాయకులు కారులో టోల్ ప్లాజా వద్దకు వచ్చారు.. టోల్ రుసుము చెల్లించాలని సిబ్బంది కోరారు. అయితే.. రుసుము చెల్లించటానికి నిరాకరించిన నాయకులు.. తాము ప్రజా ప్రతినిధులమని టోల్ గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
అనంతరం కారులో నుంచి దిగిన వైకాపా నాయకులు(ycp leaders attack).. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. దీంతో మిగిలిన స్టాఫ్ వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో టోల్ ప్లాజా సిబ్బందిలో ఒకరికి తలకు, కాలికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న బాధితుని తరఫు బంధువులు, గ్రామస్థులు ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్దిచెప్పి పంపేశారు. ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి