విశాఖ నగరంలో ఉన్న నలుగురు తెదేపా ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మరలా వారిని గెలిపించుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సవాల్ విసిరారు. తెదేపాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ అమరావతికి అనుకూలమా..? అని మంత్రి ప్రశ్నించారు. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తూ ఆయన వైకాపా నేతలతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మంత్రితో పాటు వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్ రాజ్, ఇతర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు.
ఇదీ చూడండి: ఆ జిల్లాల వాళ్లు స్థితిమంతులు: అవంతి