విశాఖ జిల్లా ఆనందపురం ఆసరా కార్యక్రమంలో మహిళలు నిరసన గళం వినిపించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో వేచిచూసినా.. మంత్రి అవంతి శ్రీనివాసరావు రాకపోవడంతో.. మహిళలు అసహనం వ్యక్తం చేశారు. మహిళలందరూ వెళ్లిపోతుండటంతో పోలీసులు గేట్లు ముసివేశారు. అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు ప్రసంగిస్తుండగానే మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.
అయితే మధ్యాహ్నం తరువాత మంత్రి అవంతి కార్యక్రమానికి హాజరై.. డ్వాక్రా మహిళలకు చెక్కును అందజేశారు. అనంతరం మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ఆసరా కార్యక్రమానికి ఆనందపురం మండలం నాయకులు కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు హాజరయ్యారు.