తన ముద్దు ముద్దు మాటలతో చిలిపి చేష్టలతో ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చిరాని తెలుగులో పలు కామెడీ స్కిట్లు, నాటికలు, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించిన సీనియర్ నటి అంజలి ఘోష్ కరోనాతో మృతి చెందారు.
కలకత్తా టూ విశాఖ..
కలకత్తాలో పుట్టి విశాఖ పట్నంలో స్థిరపడిన అంజలి ఘోష్ గత పది ఏళ్లుగా ఉక్కు నగరంలో పలు కామెడీ క్లబ్‌లల్లో తనదైన శైలిలో నటిస్తూ హాస్యం పండించేవారు. కొవిడ్ మహమ్మారి మరో కళాకారిణిని బలితీసుకోవడంతో తోటి కళాకారులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఫ్రంట్ లైన్ వర్కర్లు బలి..
ప్రస్తుతం మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న సమయంలో ఎంతో మంది జర్నలిస్టులు, డాక్టర్లు, శానిటరీ వర్కర్లు కరోనాకు బలవుతూనే ఉన్నారు. పొట్టకూటి కోసం కొందరు, తమలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని మరికొందరు, ప్రజల్లో కొవిడ్ పట్ల భయాన్ని పోగొట్టడం కోసం ఇంకొందరు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
సర్కారే ఆదుకోవాలి..
అలాంటి కళాకారులకు ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేస్తే మృతుల కుటుంబ సభ్యులకు ఎంతో కొంత ఆసరగా ఉంటుందని కళాకారులు కోరుతున్నారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా: సీఎం జగన్