విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం సీలేరు నుంచి చింతపల్లి రహదారిపై జీపులో ప్రయాణిస్తున్న మహిళ జారిపడి మృతి చెందింది. తలకు బలమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో డ్రైవర్ జీపు ఆపకుండా వెళ్లిపోయారని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని చింతపల్లి సామాజిక ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి...