విశాఖ జిల్లా కశింకోట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఠాణాలోని రికార్డులను పరిశీలించారు.
'సమగ్ర విచారణ'
స్టేషన్ పరిధిలోని తాళ్లపాలెం పోలవరం కాల్వలో మృతి చెందిన వైద్యురాలు శ్యామల ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నామని ఎస్పీ వెల్లడించారు. అనంతరం స్టేషన్లోని సిబ్బందితో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.