తాగు, సాగు నీటి వనరులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంటే..మరోపక్క వాటికి విఘాతం కలిగించే రీతిలో రాతి క్వారీల నిర్వాహకులు, గ్రానెట్ మాఫియాలు వ్యవహరిస్తున్నాయి. విశాఖ జిల్లా రావికమతం మండలం చీమలపాడు పరిధిలోని కళ్యాణ్ పులావ పరివాహక ప్రాంతమే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
రావికమతం మండల పరిధిలోని చాలా గ్రామాల్లో రాతి క్వారీలు విస్తరించి ఉన్నాయి. వీటిని విశాఖ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పలువురు వ్యాపారులు బినామీల పేర్లతో నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ పులావ జలాశయానికి దిగువన కొద్దిరోజులుగా క్వారీలను నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలతో భారీ స్థాయిలో గ్రానెట్ను ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వీరి నిర్వాకం వల్ల ఆయా ప్రాంతాల్లో జలాశయాలు, రహదారులు దారుణంగా తయారవుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవటంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్వారీలతో గిరిజనులకు తాగునీటి కష్టాలు - రావకమతం
విశాఖ జిల్లా రావికమతం మండలం పరిధిలో రాతి క్వారీలు గిరిజనుల పాలిట శాపంగా మారాయి. వేసవిలో నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతుంటే...మరోపక్క ఈ క్వారీలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు.