విశాఖ నగరంలోని 34వ వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్నాడు పీలా హరిప్రసాద్. దీనితోపాటు యువ సేవ అనే ఓ స్వచ్ఛంద సంస్థనూ నడుపుతున్నాడు. వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్నందుకు ప్రతినెలా ప్రభుత్వం తనకు ఇస్తున్న వేతనాన్ని పూర్తిగా పేద ప్రజలకే ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేద కుటుంబాలకు తన వంతు సహాయం చేస్తున్నాడు. రేషన్ కార్డు, ఇతర ఆధారాలు లేని మహిళలకు, పేదలకు తన జీతంతో నిత్యావసర సరుకులను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.
ఇవీ చదవండి: పోలీస్ ఆర్కెస్ట్రా: లాక్డౌన్లో వినోదం హోమ్ డెలివరీ