ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలంలో వాల్తేర్ డివిజన్(WALTAIR DIVISION) చరిత్రలోనే అత్యధికంగా 26.71 మిలియన్ టన్నుల సరకును రవాణా(GOODS TRANSPORT) చేసి రికార్డు నెలకొల్పింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 34.3 శాతం పురోగతి సాధించి.. రూ.3,090 కోట్ల ఆదాయాన్నిఆర్జించింది. గతేడాది ఇదే కాలానికి ఆర్జించిన ఆదాయం కన్నా రూ. 773.30 కోట్లు అధికంగా నమోదు చేసింది.
గతంలో రికార్డుల పరంగా అత్యధికంగా.. పోల్చిచూస్తే ఈ ఐదు నెలల కాలంలో గరిష్ఠంగా సరకు రవాణా చేయగలిగిందని వాల్తేర్ డీఆర్ఎం అనుప్ కుమార్ శతపతి అన్నారు. ఈ కాలంలో గతేడాది కంటే భారతీయ రైల్వేల మొత్తం కలిపి 131 మెట్రిక్ టన్నుల సరకు రవాణా అధికంగా జరిగితే.. అందులో వాల్తేర్ డివిజన్ 5.21శాతం పురోగతితో 6.82 మెట్రిక్ టన్నులు సాధించడం విశేషం. కొవిడ్ మహమ్మారి సమయంలో ఈ విధంగా పురోగతి సాధించడంపై సిబ్బందిని వాల్తేర్ డీఆర్ఎం అనుప్ కుమార్ శతపతి అభినందించారు. ఇదే ఉత్సాహంతో.. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పని చేయాలని సూచించారు.
''వాల్తేర్ డివిజన్ చరిత్రలోనే అత్యధిక సరకు రవాణా. ఏప్రిల్-ఆగస్టు మధ్య 26.71 మి. టన్నుల సరకు రవాణా. గతేడాదితో పోలిస్తే సరకు రవాణాలో 34.3 శాతం పురోగతి. ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ.3,090 కోట్లు ఆర్జించిన వాల్తేర్ డివిజన్.గతేడాదితో పోలిస్తే రూ.773.30 కోట్ల అధిక ఆదాయం. పురోగతికి కారణమైన సిబ్బందిని ప్రశంస'' - వాల్తేర్ డీఆర్ఎం, అనుప్ కుమార్ శతపతి
ఇదీ చదవండి:
విశాఖలో దొంగలు అరెస్ట్..ద్విచక్రవాహనాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం