ETV Bharat / state

లాక్​డౌన్ వేళ మామిడితోటలో.. మందేసి చిందేసిన వాలంటీర్లు - volunteers violet 144 section in vizag

కరోనాపై అవగాహన కల్పించాల్సిన గ్రామ వాలంటీర్లే... మందుతాగి చిందేశారు.స్నేహితుడి పుట్టినరోజు వేడుకను సామూహికంగా డ్యాన్సులు వేస్తూ జరుపుకున్నారు. విశాఖ జిల్లా ఎలమంచలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఈ ఘటన జరిగింది.

volunteers party in vizag in lock down time

author img

By

Published : Apr 22, 2020, 9:59 PM IST

Updated : Apr 22, 2020, 10:08 PM IST

మామిడితోటలో పుట్టినరోజు వేడుక...చిందులేసిన వాలంటీర్లు

144 సెక్షన్ అమలులో ఉన్నా గ్రామ వాలంటీర్లు మాత్రం సామూహికంగా పార్టీ చేసుకొని డ్యాన్సులు వేశారు. విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనం కలిగించింది. పుట్టినరోజు పార్టీ చేసుకున్న 11 మంది గ్రామ వాలంటీర్లపై ఎలమంచిలి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో 11 మంది గ్రామ వాలంటీర్లు పనిచేస్తున్నారు. వీరంతా.. ఓ వార్డు వాలంటీరు పుట్టినరోజు పురస్కరించుకొని గ్రామంలోని ఒక తోటలో పార్టీ చేసుకున్నారు. మందు, బిర్యానీతో హల్ చల్ చేశారు. మైక్​సెట్ పెట్టుకొని పాటలతో డాన్స్​లు చేశారు. వీళ్లే ఈ తతంగాన్ని అంతా వీడియో తీయించుని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ విషయం వైరల్​ అయింది. దీనిపై స్పందించిన గ్రామీణ ఎస్సై సంతోష్ 11 మంది పైన 144 సెక్షన్ ఉల్లంఘన కింద క్రిమినల్ కేసు నమోదు చేశామని తెలిపారు.

ఇదీ చూడండి కన్నా... కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్​?: విజయసాయి

Last Updated : Apr 22, 2020, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.