ETV Bharat / state

'కరోనా కారణంగా కష్టపడ్డాం.. త్వరలోనే బయటపడతాం' - విశాఖ పోర్టు ఛైర్మన్​తో ఇంటర్వ్యూ

కరోనా మహమ్మారి.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంపై కోవిడ్ ప్రభావం అంతా ఇంతా కాదు. భారత నౌకా వాణిజ్య ఎగుమతులు, దిగుమతులపైనా తీవ్రంగానే ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. గత 6 నెలలుగా విశాఖ పోర్టు ఎదుర్కొంటున్న ఆటుపోట్లపై... పోర్ట్ ఛైర్మన్ కే. రామ్మోహన్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

vizag port trust chairman rammohan rao interview
విశాఖ పోర్టు ట్రస్టుపై కొవిడ్ ప్రభావం
author img

By

Published : Sep 17, 2020, 2:11 PM IST

Updated : Sep 17, 2020, 4:39 PM IST

విశాఖ పోర్టు ఛైర్మన్ రామ్మోహన్ రావుతో ముఖాముఖి

కరోనా ప్రభావం విశాఖ పోర్టుపై ఈ 6 నెలలుగా ఎలా ఉందన్న అంశాలపై పోర్ట్ ఛైర్మన్ కే. రామ్మోహన్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ప్రశ్న: ఈ 6 నెలల కాలంలో మీరు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొన్నారు? వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు?

జవాబు: గతేడాది ఇదే సమయంలో 21 మిలియన్ టన్నుల సరకులను హ్యాండిల్ చేస్తే ఈసారి 19 మిలియన్ టన్నులు మాత్రమే చేయగలిగాం. స్టీమ్ కోల్, కుకింగ్ కోల్ తగ్గింది. ఆయిల్ కూడా తగ్గింది. గత సంవత్సరంతో పోలిస్తే ఐరన్ ఓర్ బాగా ఎక్కువగా చేశాం. మొత్తం మీద దాదాపు 6 శాతం వరకు తగ్గుదల కనిపించింది. ఐరన్ ఓర్​లో 10 శాతం పెరుగుదల ఉంది. మిగిలిన పోర్టులలో 15 నుంచి 22 శాతం వరకు తగ్గుదల కనిపించింది. వారితో పోలిస్తే మనం కొంత మెరుగ్గానే ఉన్నాము. ఈ పరిస్థితి నుంచి రానున్న నెలల్లో బయట పడతామని ఆశిస్తున్నాం.

ప్రశ్న: ప్రధానంగా ఏయే దేశాల నుంచి మనకు దిగుమతులు, ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి?

జవాబు: విద్యుత్ కేంద్రాలన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేయడంలేదు. స్టీమ్ కోల్​కి డిమాండ్ తగ్గింది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి మనకు టీం కాల్ వస్తుంది. ఐరన్ ఓర్ మనకు పెరిగింది. చైనా, జపాన్, కొరియా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కంటెయినర్లలో ఎక్స్​పోర్ట్ పెరిగింది.

ప్రశ్న: కొత్త కార్గో ఎంతవరకు మనకు అందుబాటులోకి వస్తోంది?

జవాబు: కొత్త కార్గోలో స్టీం కోల్ ఒకటి. మనం గతంలో దిగుమతి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు దేశంలో ఉన్న బొగ్గు నిల్వలను స్టీమ్ కోల్​ను దేశీయ అవసరాలతో పాటు ఎగుమతికి అవకాశం ఇచ్చారు. పంచదార ఎగుమతికి చూస్తున్నాం. ఆహార దినుసులు, బియ్యం ఎగుమతికి అవకాశం ఉంది. గ్రానైట్ బ్లాక్స్, ఫ్లై యాష్ ఎగుమతికి ఎన్టీపీసీ ప్రయత్నిస్తోంది.

ప్రశ్న: పోర్టులో కాలుష్యం తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు: ఎక్కువ శాతం ఓపెన్ లేకుండా చూస్తున్నాం. బొగ్గు విషయంలో ప్రత్యేకంగా గాలికి ఎగరకుండా చర్యలు తీసుకుంటున్నాం. స్ప్రింకర్లను ఉపయోగించి దుమ్ము పైకి లేవకుండా ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కాలుష్యం గణనీయంగా తగ్గింది. కాలుష్య నివారణ చర్యలు నిరంతరాయంగా చేస్తూనే ఉన్నాం .

ప్రశ్న: అమ్మోనియం నైట్రేట్ దిగుమతి విషయంలో ఎటువంటి ఉత్తర్వులు ఉన్నాయి?

జవాబు: అమ్మోనియం నైట్రేట్ ఎరువుల పరిశ్రమలో ఉపయోగించే గ్రేడ్. ప్రస్తుతం మూడు నౌకలు తీరంలో ఉన్నాయి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రస్తుతం ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే దశలో ఉంది. వేచి చూస్తున్నాం.

ప్రశ్న: ఈ ఏడాది ఎంత కార్గో హ్యాండ్లింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు?

జవాబు: పోర్టు చరిత్రలోనే రికార్డు స్థాయిలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో 72.72 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేశాం. ఈసారి మా లక్ష్యం 75 మిలియన్ టన్నులు. ఇప్పటికే 6 మాసాలు గడిచిపోయాయి. మిగతా 6 నెలల్లో ఈ పరిస్థితి నుంచి బయటపడి.. లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశిస్తున్నాం.

ఇవీ చదవండి:

ఇంద్రకీలాద్రిపై వివాదం... దేవాదాయశాఖ విచారణ ముమ్మరం

Last Updated : Sep 17, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.