ETV Bharat / state

వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళికతో.. విశాఖ వాసులకు అనుకోని ఇక్కట్లు! - vizag latest news

కొన్నేళ్లుగా మీరుంటున్న ఇంటి మీదుగా కొత్త రోడ్డు వెళ్లొచ్చు. జీవితాంతం దాచిన డబ్బుతో కొన్న స్థలం ‘గ్రీన్‌బెల్టు’ పరిధిలో చేరొచ్చు. మీ లేఅవుట్‌లో సగానికిపైగా ప్లాట్లు రహదారిలో కలిసిపోవచ్చు. మీ స్థలాన్ని అమ్ముకోలేక, బ్యాంకుల నుంచి రుణం పొందలేక ఎవరూ కొనుగోలుకు ముందుకురాక మీరు పడరాని పాట్లు పడొచ్చు! విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) కొత్తగా రూపొందించిన ‘బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) 2041’తో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా చోట్ల... ఇలాంటి పరిస్థితి ఎదురవ్వొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళికతో నగరవాసుల ఇక్కట్లు

author img

By

Published : Jul 4, 2021, 4:34 PM IST

విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) కొత్తగా రూపొందించిన ‘బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) 2041’తో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా చోట్ల పై పరిస్థితి ఎదురవ్వొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పూర్తిగా గమనించకుండా రోడ్లను ప్రతిపాదించారని, ఫలితంగా అధిక సంఖ్యలో ప్రజల ఆస్తులకు నష్టం కలగొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. వీఎంఆర్‌డీఏ అనుమతిచ్చిన లేేఅవుట్లలోని ప్లాట్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతింటాయి. కొన్నిచోట్ల భూముల వినియోగం తారుమారైంది. ఈ నేపథ్యంలో అధికారులు రూపొందించిన ముసాయిదాను ప్రజలు ఓ సారి తనిఖీ చేసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సందేహాలుంటే...

విజయనగరం జిల్లాలో 16, విశాఖ జిల్లాలోని 19 మండలాల్లో 4,873 చదరపు కిలోమీటర్ల పరిధికి వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక తయారు చేసింది. మొత్తం భూమిని నివాస, వాణిజ్య, బహుళవినియోగ, పారిశ్రామిక, గ్రీన్‌బెల్టు, పర్యాటకం, ప్రభుత్వ, రవాణాపరంగా వినియోగించేలా ప్రణాళిక తయారు చేశారు. ఇందులో జలవనరులు, కొండలు, అడవులు, వ్యవసాయభూములూ ఉంటాయి. వీటి వినియోగంపై అభ్యంతరాలుంటే ఈ నెల 15లోగా ఫిర్యాదు చేయొచ్ఛు వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, విశాఖ, విజయనగరం కలెక్టరేట్లలో బృహత్తర ప్రణాళిక మ్యాప్‌లను ప్రదర్శనగా ఉంచారు. ఏమైనా సందేహాలుంటే 9866076938 నంబరుకు ఫోన్‌ చేయొచ్ఛు.

కనిపించని చిత్రాలు...

ప్రస్తుతం అందుబాటులో ఉంచిన మాస్టర్‌ ప్లాన్‌ పూర్తిగా అర్థంకాక ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. మొత్తం ఆంగ్ల భాషలో ఉండడంతో నిపుణులకు తప్ప సామాన్యులెవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ మ్యాప్‌లు కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లలో కనిపించక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల గడువు మరికొంత కాలం పెంచాలనే డిమాండు వినిపిస్తోంది. వివిధ రూపాల్లో ఇప్పటి వరకు సుమారు 400కుపైగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

ఆస్తులను కోల్పోయే పరిస్థితి...

డెంకాడ, కాపులుప్పాడ, భోగాపురం, భీమిలి మండలాల్లో రోడ్ల ప్రణాళికపై విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ పక్కపక్కనే ఏ ఆలోచనతో 80, 100, 150, 200 అడుగుల రోడ్లను ప్రతిపాదించారో అర్థం కావడం లేదంటున్నారు. ఇలా చేయడం వల్ల ఒక్కో మండలంలో పది నుంచి ఇరవై లేఅవుట్లు దెబ్బతింటున్నాయి. మొత్తంగా 150 నుంచి 250 లేఅవుట్ల మధ్యలో నుంచి మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు వెళ్తున్నట్లు రియల్టర్లు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ వీఎంఆర్‌డీఏ అనుమతించినవే. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని వాపోతున్నారు.

తెలుగులో ముద్రించాలి...

ముసాయిదాను తెలుగులో ముద్రించకపోవడంపై విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ అభ్యంతరంవ్యక్తం చేశారు. కేవలం ఆంగ్ల భాషలోనే అందుబాటులో ఉంచడంపై తప్పుపడుతూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి లేఖ రాశారు.

ఇదీ చదవండి:

Satya Sai Water supply Scheme: తప్పుకొంటున్నారా.. తప్పిస్తున్నారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.