రేపు పరిషత్ ఓట్ల లెక్కింపు ఉండగా.. విశాఖ జిల్లాలో కౌంటింగ్ ఏజెంట్లకు కరోనా సోకడం కలకల సృష్టించింది. 90 మందికి కరోనా పరీక్ష చేయగా.. 29 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే వారిని ఐసొలేట్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. 2 డోసుల టీకాలు తీసుకున్న వారినే కౌంటింగ్ ఏజెంట్లుగా తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ర్యాపిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం.. బావిలో శవమై