కొవిడ్ మహమ్మారి సమయంలోనూ కార్గోను రవాణా చేసేందుకు అనుసరించిన పద్ధతులను మరింతగా విస్తరించేందుకు... విశాఖ జిల్లా వాల్తేర్ డివిజన్ ప్రణాళిక సిద్ధం చేసింది. సంప్రదాయ ట్రాఫిక్ పద్ధతులను అవసరమైన చోట కొనసాగిస్తూనే, చిన్న పార్సిళ్లను, కార్గోను రైళ్ల ద్వారా చేరవేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. మెడికల్ పరికరాలను, అత్యవసర సరకులను, కొవిడ్ సమయంలో రవాణా విస్తృతంగా చేయగలిగారు. ఇందుకోసం పలు ప్రోత్సాహకాలను సైతం ప్రవేశపెట్టింది వాల్తేర్ డివిజన్. బల్క్ కార్గోను గుర్తించిన ప్రదేశాల నుంచి రవాణాకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా గూడ్స్ షెడ్‌ను ఒక సముదాయంగా ఆధునీకీకరించింది. విజయనగరం జిల్లాలోనూ పార్సిల్ సర్వీసుల నిర్వహణ చేపట్టింది.
సేవలు మెరుగ్గా..
కార్గోను పంపేవారు, వ్యాపారాన్ని నిర్వహించే వారు, పార్సిళ్లను పంపేవారు, తీసుకునేవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. ఈ సేవను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. బిజినెస్ అభివృద్ధి విభాగాన్ని వాల్తేర్‌లో ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరాయంగా ఆటోమోబైల్స్, ఫ్లై యాష్, ఇతర నిత్యావసరాల రవాణా పెరిగినట్టు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే కరోనా మహమ్మారి విస్తరణ సమయంలో.. సరకు రవాణాలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని మరింత అచరణాత్మకంగా విస్తరిస్తున్నట్టు తెలిపింది. రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి.. మూడు ఆటోమొబైల్ రేక్‌లను తీసుకురావడం ద్వారా.. 370కి పైగా టాటా ఏస్ వాహనాలను రవాణా చేసింది.
4300 టన్నుల మామిడి తరలింపు...
విజయనగరం నుంచి 4300 టన్నుల మామిడిని వివిధ ప్రాంతాలకు పంపింది. ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రణాళికల ద్వారా రైల్వేతో తమ వ్యాపారానికి అవకాశం కల్పిస్తున్నట్టు వివరించింది.
ఇదీ చదవండి: