థాయ్‌లాండ్ వేదికపై మన భారతీయ నృత్య కళలతో విశాఖ బాలికలు ఆకట్టుకున్నారు. బహుభాషా నృత్య కళలను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు. థాయ్‌లాండ్‌కు చెందిన శ్రీనఖరిన్విరాట్ విశ్వవిద్యాలయం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ కళా, సాంస్కృతిక నృత్యోత్సవంలో ప్రదర్శన ఇచ్చే అరుదైన అవకాశాన్ని ఏడుగురు బాలికల నృత్య బృందం సొంతం చేసుకుంది. ఒకే వేదికపై, ఒకే బృందం భిన్నమైన వస్త్రాలంకరణలతో, వైవిధ్యమైన నృత్య ప్రదర్శనలు ఇస్తూ అందరినీ అబ్బుర పరిచింది. విశాఖలోని స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్‌కి చెందిన ఈ నాట్య బృందం మన దేశ జానపద, నృత్య కళలకే పరిమితం కాకుండా బంగ్లా, నేపాలీ నృత్యరీతులపైనా పట్టు సాధించారు. వివిధ రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇచ్చి కళా ప్రేమికులను మెప్పించిన ఈ బాలికల నృత్య బృందం ఇటీవల అంతర్జాకీయ వేదికపై ప్రదర్శన కనబరిచి కళా రంగంలో విశాఖకు ఉన్న పేరును ఇనుమడింపజేశారు.
బహుళ నృత్యరీతులపై పట్టు... విశాఖ బాలికల టాలెంట్ - thailand
తమ నృత్యాలతో థాయ్‌లాండ్ వాసులను మెప్పించారు విశాఖ బాలికలు. అన్ని రకాల నృత్యాల్లో ప్రావీణ్యం సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు.