ETV Bharat / state

విష వాయువు చిదిమేసింది.... విషాదం మిగిల్చింది - Vizag Gas Leak live updates

విశాఖలో విషాద ఘటన... దేశవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను కలిచివేసింది. ఎంతోమంది.. విశాఖ దృఢంగా ఉండాలని అందరూ ప్రార్థించారు. కానీ.. ఈ భయానక ఘటనలో బాధితులుగా నిలిచినవారు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అంతకు మించి ఏం చేయలేని దుస్థితి వారిది. కరోనా కష్టకాలంలో... లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమై ఉన్న నాలుగు గింజలతోనే కడుపు నింపుకొంటూ... గడ్డుకాలం ఎదుర్కుంటోన్న ఆ గ్రామస్థుల పాలిట ఉపద్రవంలా వచ్చిపడింది ఈ ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదం.

విష వాయువు చిదిమేసింది.... విషాదం మిగిల్చింది

author img

By

Published : May 14, 2020, 2:54 PM IST

విష వాయువు చిదిమేసింది.... విషాదం మిగిల్చింది

కరోనా కష్టకాలంలో... లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమై ఉన్న నాలుగు గింజలతోనే కడుపు నింపుకొంటూ.. గడ్డుకాలం ఎదుర్కుంటోన్న ఆ గ్రామస్థుల పాలిట ఉపద్రవంలా వచ్చిపడింది ఈ ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదం. ఘటన జరిగి చాలా రోజులైంది. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పింది. సంస్థ సైతం ఈ ఘటనకు బాధ్యత వహిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో సహా ఏవీ బాధితుల్లో ధైర్యం నింపలేకపోతున్నాయి. ఎవరినీ కదిలించినా... గుండెల్లో భయం, కళ్లల్లో అంతులేని ఆవేదనే కనిపిస్తున్నాయి.

వాయువుతో ఉక్కిరిబిక్కిరి

ఆ రక్కసి వాయువు ధాటికి... ప్రజలు చీమల్లా చెల్లాచెదురు అయిపోయారు. గాఢ నిద్రలో ఉండగా... మరింత గాఢతతో కూడుకున్న స్టైరీన్‌, ఆ రోజు సూటిగా వారి శ్వాసనాళాల్లోకి ప్రవేశించి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక ఎప్పటికి మరిచిపోలేని రీతిలో ఆ వాయువు అవశేషాలను మనుషుల శరీరాల్లో, వారి మనుసుల్లో నింపేసింది. వాయువు ప్రభావంతో మతిస్థిమితం కోల్పోయినవారిలా రోడ్లపై పరిగెత్తిన ప్రజల మానసిక స్థితి ఎవరు బాగుచేయగలరు?

అయోమయంగా.. ఆందోళనగా ప్రాణాలు కాపాడుకోవటం కోసం... ప్రాణవాయువు కోసం పరిగెత్తారు. కళ్లు కనిపించక, పక్కనున్న బావిలో, మురికికాల్వలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన కళ్లు చెమర్చేలా చేసింది. ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. తామేం తప్పు చేశామని... ఇంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నామో తెలియక అల్లాడుతున్నారు.

భయందోళనలో ప్రజలు

ఈ ఘటన తర్వాత ఎంతో ఇష్టంగా కట్టుకున్న సొంతి ఇళ్లనే వదిలి తరలిపోతున్న దృశ్యాలు అందరి గుండెలనూ మెలిపెట్టాయి. విషవాయువుతో పాటు, బాధతో బరువెక్కిన హృదయాలతో ఉన్న ఇంటిని, వస్తువులను, ప్రమాదంలో అసువులు బాసిన మూగజీవాలను వదిలివెళ్లారు. కట్టుబట్టలతో ఆశ్రయం కోసం బంధువుల ఇళ్లలో తలదాచుకునేందుకు బిక్కుబిక్కుమంటూ వెళ్లిన వైనం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది.

గ్రామాలను పూర్తిగా శుభ్రం చేశామని రెండు రోజుల తర్వాత సొంతూళ్లకు రండి.. అని అధికారులు చెప్పటమే కాదు, ఏకంగా ప్రజాప్రతినిధులు వారికి భరోసాగా ఆ ఊళ్లల్లోనే నిద్రించాల్సి వచ్చిందంటే.. ఈ ఘటన అక్కడి అక్కిడివారిని ఎంతగా భయపెట్టి ఉంటుందో అర్థం చేస్కోవచ్చు. పెద్దఎత్తున వెలువడిన విషవాయువు ప్రమాదకరంగా వచ్చిందే.. అయితే, ఇటువంటి ప్రమాదం మరోసారి జరిగితే ఏంటన్న భయమే వారిలో గుబులు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ 5గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు.

భవిష్యత్​లో ఆరోగ్య సమస్యలు

ఈ వాయువు ప్రభావం ప్రస్తుతానికి పరిమితం కాదు. దీని వల్ల ఏర్పడిన శారీరక సమస్యలు, మానసిక ఆందోళన వారిని ఎల్లకాలం వెంటాడుతాయి. దుర్ఘటన జరిగిన 5రోజులు కావొస్తున్నా.. పరిసరాలను పూర్తిగా శుభ్రం చేశామని అధికారులు చెబుతున్నా... ఇప్పటికీ ఒంటిపై మంటలు, గుండెళ్లో మంటలు తగ్గలేదని చెబుతున్నారు స్థానికులు. కళ్లముందే మాడిమసైపోయిన చెట్లను, పిట్లలను చూస్తూ కంటనీరు పెట్టడం తప్ప వారు చేసేదేం లేకుండా పోయింది.

ఇప్పుడిచ్చిన పరిహారం ముఖ్యం కాదని, భవిష్యత్తులో అనేక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నందున... తమకు జీవిత బీమా కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. కనీసం ఇదైనా తమ బతుకుల మీద భరోసా కలిగిస్తుందన్న చిన్న ఆశ మాత్రమే వారి ముఖాల్లో కనిపిస్తుంది.మొన్నటికి మొన్న ప్రమాదంలో చనిపోయిన చిన్నారి తల్లి... పరిశ్రమ గేటు దూకి మరీ, తన ఆక్రందన వెళ్లగక్కింది. ఆ కర్మాగారాన్ని ఇక్కడి నుంచి తరలించాలని వేడుకుంటున్నారు స్థానికులు.

బాధితుల్లో భరోసా నింపేదేవరు?

ప్రమాదం జరిగిన గంటల్లోనే... ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకుంటామని చెప్పింది. ఆర్థికంగా పరిహారాలు ప్రకటించింది. కానీ, బాధితుల్లో మాత్రం ఇవేవీ భరోసా నింపలేకపోయిందంటున్నారు గ్రామస్థులు. మరి బాధితుల్లో ధైర్యం నింపేదెవరూ, ఉపద్రవంలా ఊడిపడ్డ ఈ ప్రమాదం వారి అస్తిత్వాలనే ప్రమాదంలో పడేశాయి. ఉనికినే ప్రశ్నార్థకం చేశాయి. మరి వారిని ఓదార్చేదెవరు. భవిష్యత్తులో తమకేం కాదంటూ బాధ్యతగా వారి బాధలను పట్టించుకునేదెవరు. ప్రభుత్వమా.... ఆ పరిశ్రమా?

ఇవీ చదవండి:

వెంకటాపురంలో వెంటాడుతున్న విషవాయువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.