విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజాకు చెందిన టవర్‌పై పిడుగు పడటంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో 16 కంప్యూటర్లు, 3 ఏసీలు, సర్వర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. ఫలితంగా 15 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు మేనేజర్ పలివేల వెంకటరమణ తెలిపారు. టోల్ ఫీజు లేకుండానే రాత్రి వరకు వాహనాలు రాకపోకలు సాగించాయి. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
ఇదీ చదవండీ.. రూ.50లక్షల విలువైన గంజాయి పట్టివేత.. ఏడుగురు అరెస్ట్