ETV Bharat / state

'రైతులకు ఇబ్బంది కలగకుండానే భూసమీకరణ' - విశాఖ జిల్లాలో భూసమీకరణ

విశాఖ జిల్లాలో బలవంతపు భూ సమీకరణ జరగడం లేదని కలెక్టర్ వినయ్​చంద్​ చెప్పారు. పది మండలాల్లో భూసమీకరణ కొనసాగుతోందని వెల్లడించారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించి ఉంటే వారితో సామరస్యంగా చర్చించిన తర్వాతే ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు.

vinay chand
vinay chand
author img

By

Published : Feb 21, 2020, 11:24 PM IST

భూసేకరణ వివరాలు వెల్లడిస్తోన్న కలెక్టర్ వినయ్ చంద్
విశాఖ జిల్లాలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రక్రియ జరుగుతోందని జిల్లా కలెక్టర్ వినయ్​చంద్ చెప్పారు. బలవంతపు భూసేకరణ జరగడం లేదని అన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. అలాగే ఇళ్ల స్థలాల కోసం జిల్లాలో 2,50,534 లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. వీరిలో జీవీఎంసీ పరిధిలో 1,77,961 మంది కాగా గ్రామీణ ప్రాంతంలో దాదాపు 65,830 లబ్ధిదారులను గుర్తించినట్టు కలెక్టర్ వివరించారు. గ్రామీణ ప్రాంతంలో 1590.11 ఎకరాల భూమి అవసరం కాగా 1368.9 ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే సేకరించామని... అదనంగా 168.53 ఎకరాల అసైన్డ్ భూమిని గుర్తించినట్టు కలెక్టర్ వెల్లడించారు. పాడేరులో ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్నందున అక్కడే ఆ ప్రాంత గిరిజనులకు కేటాయింపులు ఎక్కువగా చేస్తునట్టు చెప్పారు.

విశాఖ జిల్లాలో పది మండలాల్లో భూ సమీకరణ జరుగుతోందని కలెక్టర్ వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చే వ్యక్తులకు ల్యాండ్​పూలింగ్ ఓనర్ షిప్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. భూసమీకరణ కోసం ప్రభుత్వం రూ.1300 కోట్లు నిర్దేశించిందని తెలిపారు. భూ సమీకరణ ద్వారా 950 ఎకరాలు వీఎంఆర్​డీఏకు సమకూరుతాయని అన్నారు. ఈ భూమి విశాఖ జిల్లాలో నూతన అభివృద్ధి పథకాలకు వినియోగించనున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'బీసీ నేతలు ఎదగడాన్ని జగన్‌ సహించలేకపోతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.