Vishakapatnam Commissner of Police: పోలీసులపై జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని విశాఖపట్నం పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ అన్నారు. ఎయిర్పోర్టు వద్ద జనసేన నాయకులు ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లు విచారణలో తెలిందని.. దీనిపై పూర్తిగా దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి రోజాపై దాడి చేయాలనుకోగా.. పీఎకి గాయమైందన్నారు.
పవన్ కల్యాణ్ ర్యాలీకి అనుమతి లేకున్నా.. నిర్వహించటం వలన 30 మంది ప్రయాణికులు విమానాన్ని అందుకోలేకపోయారని.. ట్రాఫిక్ వల్ల అత్యవసర సేవలకూ, ప్రజలకు ఇబ్బంది కలిగిందన్నారు. దాడికి సంబంధించిన వీడియోలు ప్రదర్శించి యువకులు ఇటువంటి ఘటనలకు పాల్పడుతూ.. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదనీ, ర్యాలీ వద్దని చేప్పేందుకు చేసిన ప్రయత్నాన్ని అపార్థం చేసుకున్నారని సీపీ తెలిపారు.
ఇవీ చదవండి: