కరోనా కట్టడిలో భాగంగా విశాఖ రైల్వే అధికారులు జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. పలు రైళ్ల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో తాజాగా వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం జి.సునీల్‌కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు. విశాఖ నగరం నుంచి రైళ్లలో వెళ్లాల్సిన వారంతా జ్ఞానాపురం వైపున్న 8వ ప్లాట్‌ఫాం నుంచి మాత్రమే లోపలికి రావాలని, ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు రైల్లో వచ్చినవారు 1వ ప్లాట్‌ఫామ్ నుంచి మాత్రమే బయటికి వెళ్లాలని చెప్పారు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల్లో ఒకే మార్గం తెరిచి ఉంటుందని, మిగిలిన మార్గాలన్నీ మూసేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చి, వెళ్లే ప్రయాణికులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే రాకపోకలకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. బెర్తులు కేటాయించిన వారిని మాత్రమే స్టేషన్‌లోకి అనుమతిస్తామని అన్నారు. కఠిన నిబంధనల నేపథ్యంలో రైలు బయలుదేరే సమయం కన్నా 2 గంటలు ముందే ప్రయాణికులు చేరుకునేలా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం.. గంటకు 300 మందికి మాత్రమే